Wednesday, February 11, 2026

శ్రీరామనవమి

రేపు మద్యం దుకాణాలు బంద్


శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని రాష్ట్రంలో ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మద్యం దుకాణాలు మూసివేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 17వ తేదీ బుధవారం మద్యం దుకాణాలు బంద్‌ కావాల్సిందే అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఎవరైనా ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైన్స్‌, కల్లు కాంపౌండ్లు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నీ మూతపడనున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular