బాబ్లీ ప్రాజెక్టు కేసులో న్యాయస్థానం కి హాజరైన నాయకులు





ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీమంత్రి బోండా ఉమా వారి తోపాటు వచ్చిన బృందానికి బోధన్ కమ్మ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికి సన్మానం చేశారు. బోధన్ కమ్మ సంఘం భవనము చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను సంఘ అధ్యక్షులు పళ్లెం పాటి శివన్నారాయణ వారి బృందం వివరించారు. కమ్మ సంఘం చేస్తున్న సేవలు పట్ల దేవినేని బోధన్ కమ్మ సంఘానికి అభినందనలు తెలిపారు. ఈ ప్రాంతంలోని రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం బాబ్లీ ప్రాజెక్ట్ కేసు విషయంలో బిలోలి న్యాయస్థానానికి నాయకులు హాజరయ్యారు. గతంలో బాబ్లీ నీటి కోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిన పోరాటంలో మాజీ మంత్రి, గంగుల కమలాకర్, హనుమంతు సిండే, చింతమనేని ప్రభాకర్ మరి కొంతమంది నాయకులు న్యాయస్థానానికి హాజరయ్యారు. కమ్మ సంఘం లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, ఆంధ్రాబ్యాంక్ రిటైర్ ఉద్యోగి ముప్పానేని అప్పారావు, తెలుగుదేశం తెలంగాణ యూత్ రాష్ట్ర నాయకులు కొడాలి రవికుమార్, న్యాయవాది హనుమంతరావు, గాంధీ, వాసు, పావులూరు వెంకటేశ్వరరావు, రామ్మూర్తి తోపాటు పలువురు పాల్గొన్నారు.
