Wednesday, February 11, 2026

మాజీ మంత్రికి బోధన్ కమ్మ సంఘం ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీమంత్రి బోండా ఉమా వారి తోపాటు వచ్చిన బృందానికి బోధన్ కమ్మ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికి సన్మానం చేశారు. బోధన్ కమ్మ సంఘం భవనము చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను సంఘం అధ్యక్షులు వారి బృందం వివరించారు. కమ్మ సంఘం చేస్తున్న సేవలు పట్ల అభినందనలు తెలిపారు. ఈ ప్రాంతంలోని రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గతంలో బాబ్లీ నీటి కోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిన పోరాటంలో మాజీ మంత్రి, మరి కొంతమంది పాల్గొన్నారు. ఆనాటి కేసులో భాగంగా నేడు బోధన్ కోర్టుకు వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, ఆంధ్రాబ్యాంక్ రిటైర్ ఉద్యోగి ముప్పమనేని అప్పారావు, తెలుగుదేశం తెలంగాణ యూత్ రాష్ట్ర నాయకులు కొడాలి రవికుమార్, న్యాయవాది హనుమంతరావు, గాంధీ, వాసు, పావులూరి వెంకటేశ్వరరావు తోపాటు పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular