ఎన్నికల క్యాంపెనర్ మధుయాష్కి తల్లి మృతి పై రాహుల్ ఆరా
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ టీ పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ని ఫోన్ లో పరామర్శించారు. మధుయాష్కి గౌడ్ మాతృమూర్తి అనసూయ సోమవారం ఉదయం మరణించిన విషయం తెలిసినదే. ఆమె మరణ వార్త తెలుసుకున్న రాహుల్ గాంధీ ఈరోజు మధ్యాహ్నం సమయంలో మధు యాష్కీ ఫోన్ చేశారు. తల్లి అనసూయ ఎలా మరణించారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనసూయ మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. బాధాకరమైన సమయంలో మధు యాష్కీ గౌడ్ కుటుంబ సభ్యులు మానసిక ధైర్యంతో ఉండాలని పేర్కొన్న రాహుల్ గాంధీ వారి పట్ల తన ప్రేమ ఆప్యాయతను సానుభూతిని ప్రకటించారు.
