
రేవంత్ రెడ్డి బిజెపి కోవర్ట్
గల్ఫ్ కార్మికుల సమస్యలపై కేంద్రంతో పోరాటం చేస్తా.
గల్ఫ్ బోర్డు ఏర్పడడానికి కృషి చేస్తా.
ఆశీర్వదించండి పసుపు బోర్డు తీసుకొస్తా.
కమలం పువ్వు చెవిలో…
కాంగ్రెస్ చెయ్యి నెత్తిన.. ప్రజలను నిండా ముంచుతున్న పార్టీలు
ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్
కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల్ కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని, అనంతరం ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జగిత్యాల నియోజకవర్గ బీర్పూర్ మండల ముఖ్య ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా .ఎం.సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ,జగిత్యాల జిల్లా బీఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల్ నియోజకవర్గం ఇంచార్జ్ లోక బాపురెడ్డి ,జగిత్యాల్ జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత , మాజీ ఎమ్మెల్సీ శ్రీ వీజీ గౌడ్ పాల్గొన్నారు.
*ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో అసమర్ధత పాలన ప్రభుత్వం కొనసాగుతుంది. అబద్ధ ప్రచారాలు. ప్రచారం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. 6 గ్యారంటీలు అన్ని 420 మాటలే… 4000 పింఛన్ ఎక్కడ… రైతులకు ఇస్తానన్న బోనస్ 500 ఎక్కడ.. రైతులకు రైతుబంధు ఎక్కడ .. రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ… అన్ని 420 మాటలే బుట్ట చోర్… తుపాకి రాముడు లాగా… మాట్లాడే విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడి మాటలు ఉన్నాయని ఘాటుగా విమర్శించారు.
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఎక్కడుందో చెప్పాలా..?.. ఐదు రోజుల్లో తేలుస్తానన్న పసుపు బోర్డు ఏమైంది… ఎంపీ పదవి ఐదు సంవత్సరాలు ముగిసింది. ఇంతవరకు ఊసే లేదు ఏం ముఖం పెట్టుకొని మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతున్నావు అరవింద్. మోడీకి ఓటేయండి అని ప్రజలకు మధ్య పెట్టి ఓట్లు అడుగుతున్నావు కమలం పువ్వు చెవిలో.కాంగ్రెస్ చెయ్యి నెత్తిన.పెట్టి ప్రజలను నిండాముంచుతున్న రెండు పార్టీలు కనుక ప్రజలు కాంగ్రెస్ బిజెపి పార్టీలను నమ్మవద్దు.
జగిత్యాల్ కోరుట్ల ప్రజలారా ఆశీర్వదించండి. సేవకుడిగా పని చేస్తా.స్థానిక ప్రాంత ప్రజలు బీడీ కార్మికులు గల్ఫ్ కార్మికులు ఎక్కువ ఉన్న ప్రదేశం గల్ఫ్ కార్మికుల సమస్యలపై కేంద్రంలో పోరాటం చేస్తా.గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పడడానికి పోరాటం చేస్తా ఆశీర్వదించండి. పసుపు బోర్డు తీసుకువస్తా రానున్న ఎంపీ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీకి మీ యొక్క మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా .ఎం.సంజయ్ కుమార్ , కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ,జగిత్యాల జిల్లా బీఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల్ నియోజకవర్గం ఇంచార్జ్ లోక బాపురెడ్డి ,జగిత్యాల్ జిల్లా పరిషత్ చైర్మన్ వసంత గ, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
