ఈద్ మిలాద్ లో ఉర్దూ బోర్డు చైర్మన్ తాహెర్ బిన్ హంధన్
హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలి తాహెర్ పిలుపు
నవీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈద్ మీలాద్ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.హిందూ ముస్లింలు సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని రాష్ట్ర ఉర్దూ బొర్డ్ చైర్మన్ కోరారు. నాయకులు, అతిథులందరినీ శాలువాలతో ఘనంగా సన్మానించి భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం తాహెర్ బిన్ హుందాన్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి ఈరోజు హిందూ ముస్లిం గంగా,జమున తైజిప్ చాటుకున్నారు. అన్నారు..మండల ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఐకమత్యాన్ని చాటుతూ సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని అన్నారు రేపు జరగబోయే రాంనవమి పండుగను హిందూ ముస్లిం సోదరులు అన్నదమ్ములుగా కలిసి ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ రాజేంద్ర కుమార్ గౌడ్,ఏ.ఎస్.ఐ లు గఫార్,మోహనరెడ్డి మరియు నాయకులు సంజీవరెడ్డి,భగవాన్, ప్రదీప్ రావు,షేక్ బాబు,జబీర్ గౌస్,అక్రం,ముస్తాక్,అప్రోజ్,అజ్గర్,షేరు, ముజాఫర్,జియా పలువురు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
