బాబ్లీ కేస్ లో బిలోలి కోర్టుకు హాజరు
2010లో గోదావరి నీటికోసం మహారాష్ట్ర ప్రభుత్వం తో పోరాటం చేసిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు పలువురు ఆనాటి శాసన సభ్యులపై మహారాష్ట్ర ప్రభుత్వం పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరిగింది గత 14 సంవత్సరాలు గా మహారాష్ట్ర లోని ధర్మ బాద్ కోర్టులో కొనసాగి జిల్లా కోర్ట్ అయిన బిలోలికి బదిలీ కావడం జరిగింది.ఈ కేస్ లో ముద్దాయిలుగా ఉదహరించిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు,నక్క ఆనంద్ బాబు తో పాటు అప్పటి శాసన సభ్యులు గంగుల కమలాకర్,హన్మంతు షిండే,రత్నం తదితరులు మంగళవారం బిలోలి కోర్టుకి హాజరు అయ్యారు.కాగా తెలుగుదేశం పార్టీ లీగల్ టీంకు చెందిన న్యాయవాదులు సిహెచ్.వి హన్మంతరావు,అమరావతికి చెందిన న్యాయవాదులు సుబ్బారావు,కృష్ణారెడ్డి,నాగరాజు,తదితరులు పాల్గొన్నారు. కోర్టు బయట తమ క్లయింట్ ల తో కేస్ గురించి తీసుకోవలసిన చర్యల గురించి న్యాయవాదుల బృందం తమ క్లయింట్ ల తో చర్చించారు.
