కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్కడ లేరని అధికారులు వెల్లడించారు. కొందరు సీనియర్ అధికారులు ఉన్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 9.20 గంటలకు ఆఫీస్‌లో అగ్నిప్రమాదం సంభవించి నట్లు వివరించారు. నార్త్ బ్లాక్‌లోని ఐసీ డివిజన్‌లోని రెండో ఫ్లోర్‌లో ఈ మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు.అమిత్ షా ఆఫీస్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని అధికారులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అగ్నిమాపక శాఖ అధికారు లు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఏడు ఫైర్ ఇంజన్ల సాయంతో ఎగిసి పడిన మంటలను అదుపు చేసినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో జిరాక్స్ మెషిన్, కొన్ని కంప్యూటర్లు, మరి కొన్న పత్రాలు అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు. ప్రమాద సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భవనంలో లేరని.. పలు వురు సీనియర్ అధికారులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చు కున్నారు..
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయంలో అగ్ని ప్రమాదం
RELATED ARTICLES
