షబ్బీర్ ఆలీ ఆధ్వర్యంలో భారీ చేరికలు.తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశాడన్న ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు రెండు పర్యాయాలు కేసిఆర్ కు అధికారం కట్టబెడితే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన కెసిఆర్ ను, బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీ ర్యాలీ పిలుపునిచ్చారు. కామారెడ్డి నియోజకవర్గ భిక్నూర్ మండల కేంద్రంలోని ఎస్ వి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ పాల్గొన్నారు. మండలంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 800 మంది బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సురేష్ శెట్కార్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని షబ్బీర్ అలీ చేరిన వారిని కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల పాలయింది అని షబ్బీర్ అలీ సభను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రము సస్యాశ్యామలం అవుతుందని. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి రాష్టాన్ని అప్పులపాలు చేసిన కెసిఆర్ రాష్ట్రానికి ద్రోహం చేసారని కెసిఆర్ ని బిఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టాలని షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 30000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి దని షబ్బీర్ అలీ వివరించారు.
తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన వారిని బొంద పెట్టాలి
RELATED ARTICLES
