మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఇంటి వద్దనే ఉండి ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ను పొందడానికి వయోవృద్ధులు మరియు దివ్యాంగులు వారి వారి వివరాలను అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 20వ తారీకున ఈ ప్రక్రియ ముగియనుంది .కావున బాన్సువాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ మీ మీ బూతులలో ఉన్నటువంటి వయోవృద్ధులు మరియు దివ్యాంగుల వివరాలను 20 వ తేదీ లోపు నమోదు చేయించే ప్రక్రియ లో చురుకుగా పాల్గొని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పాటుపడాలని ఏనుగు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండేది ఒక ఓటు హక్కు పేద ఉన్నత అనే తేడా ఉండదు. ఓటు హక్కును ప్రజలు బ్రహ్మయుధంగా ఉపయోగించుకుని రాబోయే రోజుల్లో ప్రజలకు సేవలందించే వారిని ఎన్నుకోవాలని కోరారు. బాన్సువాడ నియోజకవర్గం లో ప్రజలకు ఏ ఇబ్బంది ఎదురైనా తాను అండగా నిలుస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఏనుగు రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

