ఎన్నారై లను ఆదుకుని తీరాలి
కోటపాటి నరసింహా నాయుడు
తెలంగాణ ప్రభుత్వం ఎన్నారై పాలసీ కొరకు ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వివిధ ప్రపంచ దేశాలలో 20 నుండి 25 లక్షల మంది వలస వెళ్లినట్టుగా వివిధ సంస్థల అంచనా. వీరిలో అత్యధికంగా గల్ఫ్ మిడిల్ ఈస్ట్ దేశాలు సౌదీ అరేబియా, యు.ఏ.ఇ, ఓమన్ ఖతార్, కువైట్, తదితర దేశాలలో పెద్ద సంఖ్యలో మలేషియా, సింగపూర్ లాంటి దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, తదితర దేశాలలో కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారు . ఎన్నారైల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే చొరవ చూపాలని ప్రభాస భారతీయుల హక్కులు మరియు సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహా నాయుడు విజ్ఞప్తి చేశారు.ముఖ్యంగా 17 గల్ఫ్ దేశాలలో ఉన్నవారు అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులు , ఇండ్లలో పనివారుగా , ఎడారిలో గొర్రెలు , ఒంటెలు కాసే పని , వ్యవసాయ సంబంధం పనికి ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి ఎదురైన సమస్యల పరిష్కారానికి గాను ఎవరిని సంప్రదించాలో తెలియక , అక్కడే ఉన్న అంబాసిలను సాంప్రదించిన , సరైన సహకారం అంధక ఆందోళన చెందుతున్నారు . అక్కడ ఎదురైనా పరిస్థితులను తట్టుకోలేక అనేకమంది అర్ధాంతరంగా తనవులు చెల్లిస్తున్నారు . తాము మెరుగైన జీవితాన్ని కోరుకొని విదేశాలకు ఎంతో రిస్క్ తీసుకొని వచ్చాము . మాకు భరోసా కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి , ఒక ఎన్ ఆర్ ఐ – పాలసీ కావాలని ప్రతి ఎన్ఆర్ఐ కోరుకుంటున్నాడు .
ప్రతిపాదనలతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుంది
తెలంగాణ ప్రవాసి సంక్షేమ బోర్డు :
రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధంగా సంబంధిత ఎన్ఆర్ఐ సెల్ మంత్రి కి జవాబుదారీగా ఉండే విధంగా 25 మంది సభ్యులతో తెలంగాణ ప్రవాసి సంక్షేమ బోర్డును ఏర్పరచి , ప్రతి రెండు గల్ఫ్ దేశాలకు ఒక డైరెక్టర్ , 8 అభివృద్ధి చెందిన దేశాల నుండి ఒక్కొక్క సభ్యుడు , దేశంలోని వివిధ రాష్ట్రాలలో తెలంగాణ ప్రవాసీల నుండి 4 గురు మరియు రాష్ట్రంలో తిరిగి వచ్చిన ప్రవాసీలు మరియు సామాజిక సంస్థల నుండి 4 గురు సభ్యులతో కేరళ మాదిరి నాన్ రెసిడెంట్స్ తెలంగాణ తెలంగాణేట్స్ వెల్ఫేర్ యాక్ట్ ద్వారా ప్రవాసి తెలంగాణిల
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుంది . ప్రవాసి సంక్షేమ బోర్డు ఈ క్రింది విధులు నిర్వహించాలి.
- ప్రవాసీ జీవిత బీమా
వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రవాసీలకు వర్తించే విధంగా రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేయబడుతున్న రైతు బీమా తరహాలో ప్రవాసి జీవిత బీమా పాలసీ కనీసం రూ.5, 00,000/- లు చెల్లించే విధంగా జీవిత బీమా చేయించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న రూ.10, 00,000/- ప్రవాసి భీమా యోజన తప్పనిసరిగా అమలు చేయించాలి . విదేశాలలో ఉన్నవారికి బోర్డు వెబ్ సైట్ లో దానికి సంబంధించిన సౌకర్యం కల్పించి ఆన్ లైన్ లో ప్రతి సంవత్సరం రెన్యువల్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి . - ప్రవాసి సంక్షేమ నిధి
విదేశాలలో రెండు సంవత్సరాలు గడిపి వచ్చిన లేదా అక్కడే ఉన్న ప్రతి వారికి వర్తించే విధంగా ప్రవాసి సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేర్చుకొని వారి నుండి ప్రతినెలా లేదా ప్రతి సంవత్సరం వారి వారి స్థాయిని బట్టి కొంత మొత్తం వసూలు చేసి సంక్షేమ బోర్డు ద్వారా అంతే మొత్తం జమ చేసి ఫి ఎఎఫ్ లేదా సంక్షేమ బోర్డు పరిధిలో సేవింగ్స్ ఖాతా తెరిచి వారు తిరిగి వచ్చిన తర్వాత వారికి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిపి వారిని ఇక్కడే స్థిరపడే విధంగా ఉపాధి అవకాశాలలో ఆ నిధిని ఉపయోగించుకోవడం లేదా వారికి 60 సం” లు నిండిన తర్వాత ప్రతినెల వారు కూడ బెట్టుకున్న స్థాయిలో ఫిoఛన్ ఇచ్చే విధంగా చూడాలి. - విదేశాలకు వెళ్లలేని వారికి నైపుణ్య శిక్షణ మరియు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
విదేశాలకు ఉపాధి కోసం వెళ్లాలనుకునే వారిని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని బోర్డులో సభ్యత్వం చేసుకునే విధంగా చట్టంలో పేర్కొని వారికి తగిన నైపుణ్య , శిక్షణ మరియు వారు వెళ్లే దేశం , కంపెనీ మరియు ఉండే అడ్రస్ తో సహా సమాచారం సేకరించాలి . ఇక్కడ ప్రస్తుతం ప్రారంభించిన నాక్ శిక్షణ ప్రతి నియోజక వర్గ స్థాయిలో ప్రారంభించాలి.. - విదేశాలలో మృతి చెందిన లేదా జైళ్ళ లో ఉన్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ
విదేశాలలో వివిధ కారణాలతో ఆత్మహత్యలు సహజ మరణాలు లేదా ప్రమాదాలకు గురి అయిన వారి భౌతిక కాయాన్ని వెంటనే తెప్పించే విధంగా ఆయా దేశాలలో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ప్రతి దేశంలో ఒక అధికారి లేదా ఎన్జీవో సహకారంతో తెప్పించాలి . జైళ్లలో ఉన్నవారికి న్యాయ సహాయం అదేవిధంగా ఎంబాసిలతో అనుసంధానం చేయాలి . - ప్రతి గల్ఫ్ దేశాలలో ఒక తెలుగు అధికారిని నియమించాలి.
విదేశాలలో గల్ఫ్ దేశాలలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రతి ఏంబాసి లో ఒక తెలుగు మాట్లాడే అధికారిని నియమించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పించాలి . లేదా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి దేశంలో ఒక అధికారిని నియమించాలి. - విదేశాల నుండి మోసపోయిన తిరిగి వచ్చిన వారిని ఆదుకోవాలి
విదేశాలకు వెళ్లి ఏజెంట్ల కారణంగా లేదా యజమానుల కారణంగా మోసపోయి, నష్టపోయి తిరిగి వచ్చిన వారిని ఆదుకోవడానికి సబ్సిడీలతో కూడిన రుణాలు ఇచ్చి ఉపాధి కల్పించాలి . - తెలంగాణ ప్రవాసీ దివస్
కేరళ తరహాలో ( లోక్ కేరళ సభ) రాష్ట్రానికి చెందిన ప్రవా సీ లకు ప్రతి సంవత్సరం ఒక సదస్సు ఏర్పాటు చేసి అన్ని దేశాలలోని సంస్కృతిక సాంఘిక రాజకీయ స్వచ్ఛంద సంస్థల సభ్యులను ఆహ్వానించి , రెండు రోజులపాటు సమా వేశాలు నిర్వహించాలి. తద్వారా వారి భావాలను సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి. - గల్ఫ్ దేశాలలో క్షమాభిక్ష పెట్టిన సందర్భాలలో ఆదుకోవడం.
ముఖ్యంగా గర్ల్స్ దేశాలలో వివిధ కారణాలతో అక్రమ నివాసం ఉంటున్న వేలాదిమందిని ఎలాంటి జరిమానా లేకుండా వెళ్లిపోవడానికి అవకాశం ఇచ్చిన సందర్భాలలో వారిని ఆదుకొని స్వరాష్ట్రానికి తీసుకొని రావడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి . - మృత ధన సహాయం
వివిధ దేశాలలో ఆకాశమికంగా చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి రూ.5, 00,000/- లు రైతు బీమా తరహాలో చెల్లించాలి.( ప్రవాసి బీమా లేదా ప్రమాద బీమా లేని వారికి వర్తించే విధంగా) - నకిలీ ఏజెంట్ల పై ఉక్కు పాదం
తప్పుడు వీసాలు, బోగస్ ఉద్యోగ పత్రాలు ఇస్తూ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులను మోసగిస్తున్న ఏజెంట్ల ఆట కట్టించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. కొందరు విదేశాలకు వెళ్లక అక్కడ ఏజెంట్ లాగా అవతారం ఎత్తి లేని ఉద్యోగాలు సృష్టించి వీసాలు పంపిస్తున్నారు ఇలాంటి వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు రెండు మూడు నెలలకే తిరిగి వస్తున్నారు. అందుకే ఈ ఏజెంట్ల పై కఠిన చర్యలను తీసుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని టామ్ కామ్(TOMCAM) ను బలోపేతం చేసి తద్వారా ఏజెంట్ల మోసాలను అరికట్టాలి. - ఫిలిప్పీ న్స్ తరహాలో ప్రతి గల్ఫ్ దేశానికి ఒక MP ని ఇంచార్జ్ గా నియమించాలి .
వివిధ ప్రపంచ దేశాలలో పనిచేస్తున్న కార్మికుల రక్షణ కొరకు ( ప్రొటెక్టర్ ఎమిగ్రేట్స్ ( POE ) నుండి అనుమతి పొంది) ఆయా దేశాలలో పనిచేస్తున్న వారి హక్కులు సంరక్షించడానికి ఒక్కో దేశానికి ఒక ఎంపీ ని ఇంచార్జి గా నియమిస్తే బాగుంటుంది అక్కడి కార్మికులకు ఎదురయ్యి ఇబ్బందులను దూరం చేయడానికి ఉపయోగించే ఉపయోగపడుతుంది . ఉదా” ఫిలిప్పీ న్స్ దేశం నుండి 90 లక్షల మంది ప్రపంచంలోని చాలా దేశాలకు వలస వెళ్లి ఉద్యోగం చేస్తున్నారు . వారి కొరకు ఒక్కో దేశానికి ఒక్కో ఎంపీని నియమించి నిరంతరం సహాయపడుతున్నారు . మన దగ్గర ఇలాంటి విధానం లేదు కేవలం అక్కడి ఇండియన్ ఎంబాసి ల మీదనే ఆధారపడటం వలన వారి మీద భారం పడి సరిగా మన కార్మికుల బాగోగులు పట్టించుకోవడం లేదు - ఇండియన్ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డ్
నేషనల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు తరహాలో ఇండియన్ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వ చొరవ తీసుకుంటే బాగుంటుంది ప్రపంచ దేశాలలో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు చాలా ఉపయోగపడుతుంది తెలంగాణ నుండి వివిధ దేశాలలో కార్మికులుగా పనిచేస్తున్న సుమారు 25 లక్షల మంది తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆర్థిక భద్రత ఉంటుంది .
