చక్రం తిప్పుతున్న వినయ్ఆర్మూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ కలిగింది. నిజాంబాద్ జిల్లాలో ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో గులాబీ పార్టీకి స్వస్తి పలుకుతూ ఎంతోమంది ప్రజాప్రతినిధులు హస్తం గూటికి చేరుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పావులు కదుపుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ నిరుత్సాహం చెందకుండా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కృషిలో నిమగ్నమే ఉన్నారు.ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని ఆర్మూర్ మండల ఎంపీపీ పస్క నర్సయ్య , ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగ గౌడ్ ,ఆర్మూర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి , మరియు ఎంపిటిసిలు శ్రీనివాస్ గౌడ్ , మహేష్ ,MC గంగారెడ్డి ,హన్మాండ్లు ,భూమన్న , మాజి సర్పంచ్ లక్ష్మీ నారాయణ ,మగ్గిడి దేవా రెడ్డి ,BRS ఆలూర్ గ్రామ అధ్యక్షులు మండల రజనీకాంత్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాణాలు మల్లేష్ ,కొత్తూరు సునీల్ , మగ్గిడి దేవా రెడ్డి ఈరోజు హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అద్వర్యం లో, ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మరియు ఎంపీ అభ్యర్థి తటిపత్రి జీవన్ రెడ్డి మరియు జిల్లా అద్యక్షులు మానాల మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు దెగాం ముత్యం రెడ్డి, మామిడిపల్లి మాజి సర్పంచ్ మారుతిరెడ్డి ,రాజు భాయ్ ,చిట్టి రెడ్డి ,భుపేందర్ పాల్గొన్నారు.
