Wednesday, February 11, 2026

సంక్షేమ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు సంక్షోభంలోకి

*ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల రైతన్నలు,ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఆకుపచ్చగా ఉన్న చెట్టు కొమ్మను మనకు మనమే నర్కున్నం *తనను తిరిగి రాజ్యసభకు పంపిన కేసీఆర్ రుణం తీర్చుకునే బాధ్యత బీసీలందరిపై ఉంది.న్యాయమైన హక్కుల్ని పార్లమెంటులో పోరాడి సాధించుకోవాలంటే నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని*కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష*మనమందరం సైనికుల మాదిరిగా పనిచేసి నామకు ఘన విజయం చేకూర్చి పార్టీకి పునర్వైభవం తెద్దాంఎంపీ రవి చంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధు, జెడ్పీ ఛైర్మన్ కమల్ రాజ్,మాజీ ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య, కోటేశ్వరరావులతో కలిసి మధిర నియోజకవర్గం జమలాపురంలో జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పదేళ్లు సంక్షేమ రాష్ట్రంగా వర్థిల్లిన తెలంగాణను కాంగ్రెస్ పాలకులు ఈ నాలుగు మాసాలలోనే సంక్షోభంలోకి నెట్టారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన చెందారు.ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పాలకులు అమలు చేయడం లేదన్నారు.ఎన్నికల కోడ్ పేరుతో కొత్త పథకాలు తీసుకురాగపోగా,పాత వాటి అమలు మర్చిపోయారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, పార్టీ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధు,జేడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావులతో మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం జమలాపురంలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ముఖ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుల అనాలోచిత చర్యల కారణంగా రైతన్నలు,ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఆకుపచ్చగా చెట్టు కొమ్మను మనకు మనమే నర్కున్న మాదిరిగా సుపరిపాలన అందిస్తున్న మహానేత కేసీఆర్ ప్రభుత్వాన్ని వదులుకుని తీవ్రంగా నష్టపోతున్నామన్నారు.పదేళ్లలోనే తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసిన మహనీయులు కేసీఆర్ పాలనయే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.తనను తిరిగి రాజ్యసభకు పంపిన కేసీఆర్ కి బీసీలందరం సంపూర్ణ మద్దతునివ్వాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ న్యాయమైన హక్కుల్ని సాధించుకోవాలంటే బలమైన నాయకుడు నామ నాగేశ్వరరావు పార్లమెంటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ రవిచంద్ర వివరించారు.మనమంతా సైనికుల మాదిరిగా కష్టించి పని చేసి నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించడం ద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేద్దామని, పార్టీకి పునర్వైభవం తీసుకువద్దామని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో “కారు గుర్తుకే మన ఓటు”,”బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే మన ఓటు”,”గెలిపిద్దాం గెలిపిద్దాం నామ నాగేశ్వరరావును గెలిపిద్దాం”అంటూ గులాబీ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రముఖులు తాళ్లూరి జీవన్ కుమార్,చావా రామకృష్ణ,పంబి సాంబశివరావు,శీలం కవిత,మదన్ రెడ్డి, రామకోటయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ ప్రమాణం చేసిన వద్దిరాజు రవిచంద్రకు నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular