Thursday, February 12, 2026

ప్రవాస భారతీయులను ఆదుకుంటాం.

ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన జగిత్యాల నాయకులు

ప్రవాస భారతీయులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకొని తీరుతుందని, దుబాయ్ లో జరిగిన సమావేశంలో ప్రవాస భారతీయుల ఇబ్బందులను తెలుసుకున్నామని రాబోయే రోజుల్లో ఈ విషయాలన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.దుబాయ్ లో జరిగిన ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మంగళవారంనాడు హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు చేరుకున్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేష్ కుమార్ గౌడ్ ను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు .మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ టి . జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు,టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి శేర్ నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular