శ్రీ రామనవమి వేడుకల సందర్భంగా ఇవ్వాల భద్రాద్రి ఆలయా లకు భక్తులు పోటెత్తారు.సీతారాముల కళ్యాణం ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు . అధికారులు కళ్యాణ వేదికలు ఏర్పాట్లు చూశారు.

వేద పండితులు పూజారులు మంత్రోత్సాహాల మధ్యలో శ్రీరామ కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తుల మధ్యలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. భక్తులు కళ్యాణం వీక్షించేందుకు చలువ పందిళ్లు, భక్తుల సౌకర్యార్థం చల్లని నీరు, మజ్జిగ మరియు అన్నదానం ఆలయ కమిటీ మరియు స్వచ్ఛంద సంస్థలు నిర్వాహకులు ఏర్పాటు చేశారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటు న్నారు.
