Sunday, September 27, 2026

డీసీఎం ఢీకొనడంతో మృతి చెందాడు

బైకులు ఢీ కొట్టిన డీ సీ ఎం వ్యాన్

చిన్నప్పటి నుంచి కష్టాలను సలరి లో చూసి ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదువుకున్నాడు. ఎంతో మంచి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకోవాలనుకుని మంచి సంబంధం చూసి పెద్దవాళ్ల అనుమతితో నిశ్చితార్థం పెట్టుకున్నారు. ఆ ఆనంద క్షణాలు కొన్ని గంటలు కూడా మిగలకుండా చేదు జ్ఞాపకాలను ఆ కుటుంబానికి మిగిలాయి. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ మండలంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన దిలారి ప్రభాకర్ నిశ్చితార్థం అయినా తెల్లారే ఈ విధంగా అవ్వడం రెండు కుటుంబాలకు తీరని సుఖంగా మారింది

. (తండ్రి) దిలారీ సాయిలు వీరికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు ఆర్ఎంపి డాక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు. దిలారి ప్రభాకర్ (28) సంవత్సరాలు బీఫార్మసీ చదివి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. జీవితంలో స్థిరపడ్డాడు వివాహం చేసుకున్నామని గ్రామానికి వచ్చాడు. ఇందల్వాయి మండలానికి చెందిన యువతీ ని వివాహం చేసుకునేందుకు అంగీకరించి ఈనెల 15 సోమవారం నిశ్చితార్థం సైతం అయ్యింది. ఆనంద సమయంలో మిత్రుడు రాజు, రవి లతో కలిసి బైకుపై సరదాగా బయటకు వెళ్ళాడు తిరిగి గ్రామంలోకి వస్తూ ఉండగా గ్రామ శివారు లో కళ్ళుబట్టి డివైడర్ ఉంది రోడ్లపై వడ్లు ఎండ పోయడం వల్ల జరిగే అనర్ధాలు ఇంతవరకు దారితీస్తున్నాయో చూడండి. ఇలాంటి వాటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో మలుపు ఉండడం పాల్ద నుంచి వడ్ల లోడుతో వేగంగా వస్తున్న డీ సీ ఎం ఢీకొనడంతో దాంతో బైకు కొద్ది దూరం లాక్కెళ్ళింది ప్రభాకర్ అక్కడి అక్కడే

మృతి చెందాడు. మిగతా ఇద్దరూ మిత్రులు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డీ సీ ఎం డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు. నిశ్చితార్థం జరిగి వివాహం జరుగుతున్న తరుణంలో కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. తిరుమనపల్లి గ్రామమంతా శోకంతో మునిగిపోయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular