సిరిసిల్లలో రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్‌కు నోటీసు ఇచ్చిన ఈసీ.. 18లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటీసు జారీ చేసింది.
ఈ నెల అయిదో తేదీన సిరిసిల్లలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఈ నోటీసు జారీ చేసింది.
