Sunday, May 10, 2026

సురేష్ షెట్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించండి

కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేరికలు

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కామారెడ్డి జిల్లాలో అభివృద్ధిలో తీర్చి దిద్దుతాలలో ప్రభుత్వ సలహాదారులు హామీ ఇచ్చారు.కామారెడ్డి నియోజకవర్గం గార్గుల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రవితేజ గౌడ్, సింగల్ విండో వైస్ చైర్మన్ శంకర్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు, విద్య కమిటీ చైర్మన్ బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని పార్టీలో చేరినవారు ఆశ భావాన్ని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular