ఆర్మూర్(ద్రోణ ) ఏప్రిల్17: భారతదేశ కీర్తి ప్రతిష్టను ప్రపంచానికి చాటిన ఏకైక ధర్మ చక్రవర్తి మహా సామ్రాట్ అశోక చక్రవర్తి 2368వ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత, వామపక్ష,విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ డివిజనల్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, జమాతే ఇస్లామీ హింద్ కార్యవర్గ సభ్యులు మహమ్మద్ రఫీ, అబ్దుల్ జబ్బర్,మహమ్మద్ సాజిద్, ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్ మూగ ప్రభాకర్, ఉపాధ్యక్షులు షెట్పెల్లి నారాయణ, ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంగరి ప్రదీప్,ఆర్మూర్ మున్సిపల్ కార్మిక సంఘ అధ్యక్షులు పింజ అశోక్ లు పాల్గొని సామ్రాట్ అశోకుని చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ 32 లక్షల 56వేల కిలోమీటర్ల సువిశాల అఖండ భారతాన్ని 42సంవత్సరాల పాటు ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన గొప్ప చక్రవర్తి అశోకుడని కొనియాడారు. అశోక చక్రవర్తి తన సంక్షేమ ప్రజా పాలనలో ప్రజలంతా తన బిడ్డలని ధర్మమే సమస్త జీవకోటిని రక్షిస్తుందని బలంగా నమ్మి గౌతమ బుద్ధుని ధమ్మ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేసి తన రాజ్యంలో మానవ విలువలు పెంపొందించిన గొప్ప రాజు అని వారు అభివర్ణించారు. అశోకుడి ప్రజా సంక్షేమ స్వర్ణ యుగ పాలనలోని అశోక ధర్మ చక్రం మన జాతీయ పతాకంలో అలాగే సారనాథులోని అశోకుడు ప్రతిష్టించిన ఏకశిలా స్తంభం మీద నాలుగు సింహాల తలాటం మన దేశ అధికార ముద్రకు నిదర్శనం అని పేర్కొన్నారు.బుద్ధుడు ప్రబోధించిన దమ్మ మార్గాన్ని అశోక చక్రవర్తి ప్రజాసంక్షేమ పాలనను బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న ప్రభుద్ద భారత్ నిర్మాణం దిశగా అశోకరాజ్య స్థాపన కై ప్రతి బహుజనుడు నడిచి బుద్ధుడు, అశోకుడు, అంబెడ్కర్ కళలు గన్న శోకం లేని,స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం లతో కూడిన పరిపాలన కొరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో రచర్ల సాయిరాం,ప్రకాష్,రాజేష్, మోహన్, రాజు తదితరులు పాల్గొన్నారు
దమ్మ అశోకరాజ్య స్థాపనకు పునరంకితమవుదాం.
RELATED ARTICLES
