బాసర్ త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించే నాధుడే కరువ
త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపించాలి

ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) బోధన్ కమిటీ సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన మొదలై మూడు నెలల గడుస్తున్న విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం దారణమని అన్నారు. అదేవిధంగా బాసర త్రిబుల్ ఐటీ లో ప్రతి సంవత్సరం విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని వెంటనే సెట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి బాసర త్రిబుల్ ఐటీని సమస్యల గుండం నుండి అభివృద్ధి వైపు బాసరను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో అక్షయపాత్ర విఫలం చెందుతుందని అన్నారు. అదేవిధంగా బోధన్ ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రభుత్వ విద్యాసంస్థలైన జవహర్ నవోదయ, ఇంజనీరింగ్ కాలేజీలను నెలకొల్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. అదేవిధంగా బోధన్ లోని పలు కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజుల పేరిట డొనేషన్ల పేరిట ఫీజులు వసూలు చేస్తున్నాయని వాటిపైన విద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని లేనిచో భవిష్యత్తులో ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మహేష్ బోధన్ డివిజన్ నాయకులు ప్రశాంత్, రాజేష్, విష్ణు తదితర నాయకులు పాల్గొన్నారు.
