కాల్వలను పరిశీలించిన
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి మండలం లోని వివిధ గ్రామాల ఎస్సారెస్పీ కాలువలను సందర్శించి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం మరియు మాజీ మంత్రి దయాకర్ రావు చేసిన నిర్లక్ష్యము కారణంగా రైతులకు శాపంగా మారిందని అన్నారు. కోమటిగూడెం, బోయిన గూడెం, గూడూరు, కోతుల బాగ్, తిరుమలగిరి, నర్సింగాపూర్ గ్రామాలకు సంబంధించి ఎస్ ఆర్ ఎస్ పి కెనాల్ కు సంబంధించి 4L మరియు 5L పాయింట్లను సందర్శించి వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి ఆయా గ్రామాలలోని రైతుల గోడును క్షుణ్ణంగా విన్నారు. తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని నిధులు నిధులు మంజూరు చేయించి రైతుల కష్టాలు తీరుస్తానన్నారు.రైతులకు సంబంధించిన ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి పూర్తిస్థాయి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి పనులు పూర్తి చేసి రైతుల కష్టాలు తీరుస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు చేసేటువంటి అసత్య ప్రచారాలను రైతులు గమనిస్తున్నారని ఇలాంటి తప్పుడు కూతలు కూస్తే అటువంటి నాయకులను ప్రజలు గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మండల అధ్యక్షులు గీరగాని కుమార స్వామి పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్ ఎస్సీ సెల్ నాయకులు జలగం కుమార్ మాజీ సర్పంచులు పుల్లయ్య అశోక్ శ్రీనివాస్ పాలకుర్తి పట్టణ అధ్యక్షులు నాగయ్య యువ నాయకులు మహేందర్ లతోపాటు ఆయా గ్రామాల కార్యకర్తలు రైతులు దాదాపు 300 మంది పాల్గొన్నారు.
