Thursday, February 12, 2026

రుణమాఫీ, 500 బోనస్ రైతులకు అందిస్తాం

రోడ్డు షోలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

గత బిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామని రైతు రుణమాఫీని మరియు ధాన్యం క్వింటాలకు 500 రూపాయలు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి తీరుతుందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి స్పష్టం చేశారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాల్మీకి బోయిలను ఎస్టీలో చేరుస్తామన్నారు. జడ్పీ ఛైర్ పర్సన్ సరితా తిరుపతయ్య ప్రతిపాదించిన 3,500 ఇండ్లు గృహలక్ష్మి కింద పథకం కింద మంజూరు చేస్తామన్నారు. పదేళ్లు బిఆర్ఎస్ అడ్డగోలు పరిపాలన చేసిందన్నారు. ఎన్నికల కోడ్ అనంతరం 2లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు నీటి అవసరమైన కృష్ణ జలాలు తీసుకు రాలేదని అన్నారు. అతిత్వరలో గట్టు మండలంలో ఉన్న గ్రామాలకు 100% సాగు నీరు అందిస్తామన్నారు. మోదీ ప్రభుత్వంలో అభివృద్ధి ఊసేలేదన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని ఉంటాయని పేదలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని మల్లు రవి ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 6 గ్యారంటీలు ఆమలు అవుతున్నాయని కేంద్రంలో అధికారం వస్తే అదనంగా మరో 5 గ్యారంటీలు అమలు అవుతాయాన్నారు. రాహుల్ గాంధీ విద్యార్థులకు 30లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వచ్చే పంట నుంచి రైతులకు క్వింటాల్‌కు రూ. 500 మద్దతు ధర ఎక్కువ ఇస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ తదితరులు రోడ్ షోలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular