Thursday, February 12, 2026

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా రాజేష్

ఎలక్ట్రానిక్ మీడియా ఐజేయుకు అనుబంధం మే

నిజామాబాద్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా సుంకరి రాజేష్, ప్రధాన కార్యదర్శిగా సంఘంకార్ ధనుంజయ్, కోశాధికారి గా పులి అనిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికైన వారికి గురువారం టీయుడబ్ల్యుజె జిల్లా కమిటీ తరపున నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఐజెయు)కు తమ అనుబంధంగా పని చేస్తుందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా
తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ను
బలోపేతం చేయడంలో భాగంగా జిల్లాలో కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యలపై స్పందించి పని చేయాలని నూతన బాద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు కౌన్సిల్ సభ్యులు చింతల గంగాదాస్ ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య,జి.ప్రమోద్,నిజామాబాదు ప్రెస్ క్లబ్ కార్యదర్శి
బైర శేఖర్,ఉపాద్యక్షులు జెట్టి గోవిందరాజు,
టీయూడబ్ల్యూజె ఐజెయు జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ,కోశాధికారి సిరిగాద ప్రసాద్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు పాకాల నర్సింలు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular