ఆర్మూర్ లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన వినయ్ రెడ్డి

ఆర్మూర్ నియోజకవర్గంలోని పేదలందరికీ రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులు అందజేస్తామని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆయన ఓటర్లకు వివరించారు.

ఆర్మూర్ మండలం అందాపూర్ ,మగ్గిడి మరియు ఖానాపూర్ గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలకు చెప్పిన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి . మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంబించిందని చెప్పతు, అందపూర్,మగ్గిడి, ఖానాపూర్ గ్రామంలో ఇప్పటివరకు ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు తప్ప ఇప్పటివరకు ఈ భారతీయ జనతా పార్టీ ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆరు పథకాలను చెపుతూ నాలుగు పథకాలను అమలు చేయడం జరిగిందని మరో రెండు పథకాలు ఎంపీ ఎలక్షన్లు పూర్తికాగానే అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. మీ గ్రామానికి మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేను ఉన్నానని భరోసా కల్పించడం జరిగింది.రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఇపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నిజామాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి ,మాజి నిజాంసాగర్ కెనాల్ ఛైర్మెన్ యల్లా సాయిరెడ్డి పాల్గొన్నారు. మరియు ఆర్మూర్ మండల ఎంపిపి పస్కా నర్సయ్య , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్సాపల్లి జీవన్ ,ఆర్మూర్ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి ,దెగాం ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్,అంకపూర్ ఎంపిటిసి MC గంగారెడ్డి ,మగ్గిది మాజి సర్పంచ్ నర్సయ్య,మాజి సర్పంచ్ లక్ష్మీ నారాయణ గౌడ్ , మాజి ఎంపిటిసి సభ్యులు జెన్నపల్లి గంగాధర్ ,మగ్గిది దేవా రెడ్డి పాల్గొన్నారు.
