Thursday, February 12, 2026

జోరుగా బీజేపీ ఇంటింటి ప్రచారం

కోటగిరి మండలంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగుతుంది. మండలంలోని ఆయా గ్రామాల్లో బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.ఎత్తోండ గ్రామంలో బిజెపి పార్టీ మండల జనరల్ సెక్రెటరీ విలాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. యాద్గార్ పూర్ గ్రామంలో బూత్ అధ్యక్షులు బోధన్ హనుమంతు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ…. భారతదేశంలో గత పదేండ్లుగా నరేంద్ర మోడీ

చేపడుతున్నటువంటి సంక్షేమ, అభివృద్ధి పనులు నరేంద్ర మోడీని యూనివర్సల్ లీడర్ గా మార్చాయని అన్నారు. నరేంద్ర మోడీ తన పరిపాలన దక్షతతో దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో చోటు సంపాదించుకున్నారని చెప్పారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బిజెపి అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శివశంకర్ ,శ్యామ్, జగదీష్, వాసు, సాయిలు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular