Thursday, February 12, 2026

బీజేపీ పార్టీని, అరూరి రమేష్ ను పార్లమెంట్ ఎన్నికలలో పాతాళంలోకి తొక్కాలి

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని, పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ ను పాతాళములోకి తొక్కేలా స్థానిక ఓటర్లు తీర్పు ఇవ్వాలని, వరంగల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య పిలుపునిచ్చారు.హన్మకొండ హంటర్ రోడ్డులోని డి కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన వర్దన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.వర్దన్నపేట ప్రజలు కొట్టిన దెబ్బ సరిపోలేదు. మళ్ళీ ఇప్పుడు కొట్టె దెబ్బతో మళ్ళీ రావాలంటే భయపడాలి.నా సొంత ఊరుకి, నా సొంత ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం.నేను లోకలో, నాన్ లోకలో వర్దన్నపేట ప్రజలకు బాగా తెలుసు అన్నారు.గుంట నక్క లాంటి నాయకులు మనకు అవసరమా అని ప్రశ్నించారు.భూ బకాసురుడు అరూరి రమేష్ లాంటి దొంగలకు అవకాశం ఇస్తే ఆగమైపోతాం.బీజేపీ పార్టీని, అరూరి రమేష్ ను పార్లమెంట్ ఎన్నికలలో పాతాళంలోకి తొక్కాలి.బీజేపీ ప్రభుత్వం గత 10ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి.మీ ఇంటి బిడ్డను నేను మీ ఆశీర్వాదం కోరుతున్నాను.కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి.నేను వర్దన్నపేట బిడ్డనుకానీ ఎన్నడూ వర్దన్నపేట నుండి పోటీ చేయలేదు.వర్దన్నపేట అభివృద్ధిలో నా పాత్ర ఉంది అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.కొంత మంది వెదవలు కడియం కావ్య లోకల్ కాదు అంటున్నారు.అరూరి రమేష్ కి చిన్న మెదడు చితికి పోయింది.అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు.రాజకీయలలోకి సేవ చెయడానికి రావాలి .కానీ అరూరి రాజకీయాలలోకి వ్యాపారం చెయడానికి వచ్చాడు.అందుకే అసెంబ్లీ ఎన్నికలలో చావు దెబ్బ తిన్నాడు.దేశంలో బిజిపి ప్రభుత్వంలో అన్ని వర్గాల పై దాడులు జరుగుతున్నాయి.బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో లౌకిక వాదం లేకుండా చేస్తారు.సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చేసుస్తున్నారుబీజేపీ అరాచకాలను అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకోవాలి.బీజేపీకి చెప్పుకోవడానికి ఏమి లేదు… కేవలం దేవుళ్ళ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారు.కడియం కావ్య గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తుంది.నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు గోదావరి జలాలు అందించే బాధ్యత నాది అని కడియం హామీ ఇచ్చారు.కడియం కావ్యను నిండు మనసుతో ఆశీర్వదించాలి.మీ ఇంటి ఆడబిడ్డగా భావించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి , గండ్ర సత్యనారాయణ రావు , యశస్విని రెడ్డి , మాజీ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ , రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఎండి. రియాజ్ , డీసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular