Thursday, February 12, 2026

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుకుందాం

6 గ్యారంటీలను అమలు చేసి తీరుతాం మంత్రి తుమ్మలశాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైనటువంటి ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకుందామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ గెలుపుకై గార్ల,బయ్యారం మండలాల ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మరియు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular