Thursday, February 12, 2026

కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేసి తీరుతా

బిజెపి, టిఆర్ఎస్ లను బొంద పెడదాం జుక్కల్ ఎమ్మెల్యేశాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తనకోసం కృషి చేసిన వారిని కాపాడుకున్న తీరుతానని రాబోయే రోజుల్లో వారికి న్యాయం చేస్తానని కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడటమే తన దేవమని తనకు ఎటువంటి ఆశలు కోరికలు లేవని ముఖ్యమంత్రినీ ఒప్పించి మెప్పించి నిధులు రాబట్టి జుక్కల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని మహమ్మద్ నగర్ మరియు నిజాంసాగర్ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆకృత్యాలు, దౌర్జన్యాలు భరించి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా ధైర్యంగా నిలబడి కష్ట కాలంలో కాంగ్రెస్ జెండా మోసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలకు పాదాభివందనాలు తెలియజేశారు..తన మీద విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించిన జుక్కల్ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు.తనకు ఎటువంటి ఆశ కోరికలు లేవని, కార్యకర్తలు, ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే తన కోరిక అని అన్నారు.పదిహేను సంవత్సరాలుగా జుక్కల్ కు పట్టిన దరిద్రం వదిలింది.ఇక అందరికీ మంచి రోజులు రాబోతున్నాయి అన్నారు.పార్టీ గెలుపు కోసం కష్ట పడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.బ్రోకర్ గాళ్లు, కమీషన్లు దండుకునే వాళ్లు మాత్రమే అభద్రతా భావంలో ఉన్నారని అన్నారు.కార్యకర్తలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారని, అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారన్నారు.హన్మంత్ షిండే పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యే గా పనిచేసి నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని అన్నారు.గ్రామాలలో మౌళిక సదుపాయలు అయిన రోడ్లు, ఆసుపత్రులు,స్కూల్స్, వీధి దీపాలు, డ్రైనేజీలు ఏవి సరిగా లేవని కనీసం త్రాగడానికి మంచి నీరు కూడా లేని దుస్థితి కల్పించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.మిషన్ భగీరథ అధికారులతో మంచి నీటి గురించి రివ్యూ మీటింగ్ పెడితే నియోజకవర్గంలో 167 గ్రామాలకు త్రాగు నీటి సమస్య ఉందని అధికారులు తెలియజేయగా, తక్షణమే సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చి బోర్లు వేసి ప్రజలకు త్రాగు నీరు సరఫరా చేస్తున్నామన్నారు.తాను ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలల్లోనే రోడ్లు,పాఠశాల భవనాలు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, సెంట్రల్ లైటింగ్, ఆసుపత్రులలో అధునాతన వైద్య పరికరాలు ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటే,హన్మంత్ షిండే కడుపు మంటతో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు.ఇక బీజేపీ అభ్యర్థి బి.బి పాటిల్ రెండు సార్లు ఎంపీ గా గెలిచి ఎటువంటి అభివృద్ధి చేయలేదని.ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే కొత్తగా చేసేది ఏం ఉండదని అన్నారు.బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఓడిపోతానని భావించి బీజేపీ లోకి జంప్ అయ్యాడని అన్నారు.పదేళ్లు ఎంపీ గా పని చేసి ఎంటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేనోడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నాడని అన్నారు.అందుకే ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి సురేష్ షెట్కార్ ని గెలిపించాలని కోరారు.కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మన నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పారు.సురేష్ షెట్కార్ ని గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని ప్రజలకు వివరించారు.అనంతరం మహమ్మద్ నగర్ మరియు నిజాంసాగర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యువకులు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.మీటింగ్ కు వచ్చిన కార్యకర్తలకు స్వయంగా తానే భోజనం వడ్డించారు.కార్యకర్తలతో కలిసి తాను భోజనం చేశారు.ఈ సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ ,తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ , జుక్కల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,నాయకులుకార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular