పాస్టర్లతో సమావేశం పాల్గొన్న ఏనుగు, ఎంపీ అభ్యర్థిరాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కులమత తారతమ్యాలు లేకుండా అభివృద్ధి చేసేది సంక్షేమాలను అందించేది ఒక కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఏనుగు కోరారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి తన శాసశక్తుల కృషి చేస్తానని శాసనసభ ఎన్నికల్లో తాను నియోజకవర్గానికి కొత్తవాడిని అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతు ఇవ్వడం తనకు సంతోషం కలిగింది అన్నారు. అదే స్ఫూర్తితో తాను నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నానని, తన కృషికి ఫలితం పార్లమెంట్ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా చాటుకుని తీరుతామని ఏనుగు రవీందర్ రెడ్డి భీమా వ్యక్తం చేశారు.బాన్సువాడ నియోజకవర్గం బాన్సువాడ టౌన్ చైతన్య కాలనీలో చర్చిలో నియోజకవర్గంలోని చర్చ్ పాస్టర్లతో సమావేశనంతరం నియోజకవర్గంలోని మైనార్టీ సోదరులు ఉమ్రా ప్రార్థనకై మక్కా మదీనాకి వెళ్తున్న మైనార్టీ సోదరులను కలిసిన మాజీ శాసనసభ్యులు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మరియు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శేఖర్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం
RELATED ARTICLES
