Thursday, February 12, 2026

బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా

పదవ వార్డు కౌన్సిలర్ తో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గంగాధర్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు సమాచారం

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పదో వార్డుకు చెందిన కౌన్సిలర్ సావిత్రితో పాటు తెలంగాణ ఉద్యమకారులు గంగాధర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీ లోకి నేడు చేరుతున్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమకారులకు సరైన గౌరవం లేకనే కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్టు సమాచారం. బోధన్ పట్టణంలో తెలంగాణ ఉద్యమం కొనసాగించడంలో గంగాధర్ గౌడ్ కీలక పాత్ర పోషించడం జరిగిందని తెలిపారు.1519 రోజులు తెలంగాణ ఉద్యమం బోధన్ పట్టణంలో సిద్దిపేట్ తర్వాత కొనసాగించడంలో గంగాధర్ గౌడ్ కీలక పాత్ర పోషించారని అందరికీ తెలిసిన విషయమే నాడు తెలంగాణ కోసం ఉద్యమించిన తెలంగాణ ఉద్యమకారులు బోధన్ నియోజకవర్గంలో పాటు బోధన్ పట్టణ కేంద్రంలో ఎక్కడున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు సరైన గౌరవం లేదని కేసులు అవమానాలు ఎక్కువ అయిపోయాయని వారికి సరైన ప్రాతినిథ్యం తెలంగాణ ప్రభుత్వ హయాంలో దొరకలేదని ప్రజలు చర్చించుకోవడం, విమర్శలు చేసుకోవడం విశేషం. ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభించలేదని ఉద్దేశంతోనే గంగాధర్ గౌడ్ తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్టు సమాచారం. బోధన్ పట్టణంలో తెలంగాణ జెండా పట్టింది, బీ ఆర్ఎస్ పార్టీ 2001 నుంచి బోధన్ పట్టణంలో అభివృద్ధి చెందడంలో గంగాధర్ గౌడ్ పాత్ర కీలకమని ప్రజలు చర్చించుకోవడం విశేషం. బోధన్ లో తెలంగాణ ఉద్యమకారులకు ప్రార్ధనతలేదని త్యాగాలు ఒకరిది భోగాలు ఒకరిది అన్న చందంగా ఉండడం వల్ల చాలామంది ఉద్యమకారులు కనపడకుండా పోయారని, చర్చిలు జరగడం కోస ఎరుపు. టిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు తెలంగాణ ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేకపోవడం అవమానాలు జరగడం, నిరాశ గురై గంగాధర్ గౌడ్ తో పాటు వారి సతీమణి సావిత్రి కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరనున్నట్లు సమాచారం.2001 నుంచి టిఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకుని అప్పటి ఎమ్మెల్యే మంత్రి సుదర్శన్ రెడ్డిని ఎదురించి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర గంగాధర్ గౌడ్ పోషించారని చర్చ జరగడం విశేషం, లాఠీ దెబ్బలు తినడంతో పాటు పలు కేసులు కావటం సరైన గుర్తింపు లేకపోవడం అవమానాలు జరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చర్చలు జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular