Thursday, February 12, 2026

21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్

ఇవాళ తొలి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.
ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16కోట్ల 63 లక్షల మంది ఓటర్లు వారి భవిత వ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్‌ కోసం లక్షా 87వేల పోలింగ్ కేంద్రాల్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
తొలి దశలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 మంది మహిళలు, 11,371 ఇతరు లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్ 1వ తేదీన ముగియ నుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల ప్రక్రి య సజావుగా సాగేందుకు కేంద్ర బలగాలను మోహరించింది.
లోక్ సభ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడులో 39 సీట్లు, ఉత్తరాఖండ్ లో 5 సీట్లు ఉండగా అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణి పూర్ లో 2 సీట్ల చొప్పున ఉన్నాయి.
అండమాన్ అండ్ నికోబార్, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్ లో ఒక్కో సీటు చొప్పున ఉన్నాయి.ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొదటి విడత లోనే ఎన్నికలు ముగియను న్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular