Wednesday, March 25, 2026

విధుల్లో నిర్లక్ష్యం ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌


మల్టీ జోన్ పరిధిలో ఆరుగురు పోలీసులను ఐజి ఏవి రంగనాథ్ సస్పెండ్ చేశారు. అయిన వారిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఉన్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ప్రజా భవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ను తప్పించేందుకే పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌తో సంప్రదింపులు జరిపినట్టుగా హైదరాబాద్‌ సీపీ విచార ణలో తేలడంతో అప్పటి బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేశారు.మద్యం సేవించి పోలీస్‌స్టే షన్‌కు వచ్చి స్టేషన్‌ సిబ్బం దిని ఇబ్బందులకుగురి చేసిన నిజామాబాద్‌ జిల్లా సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రమేశ్‌ను సస్పెండ్‌ చేశారు.జగిత్యాల జిల్లా సారంగా పూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన గంజాయి కేసులో అలసత్వంగా వ్యవహారిం చిన ఎస్సైలు మనోహర్ రావు, తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ బి. రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ టి.నరేం దర్ లను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- 1 ఐజీ రంగ నాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular