Thursday, February 12, 2026

బీబీ పాటిల్ ను చిత్తు చిత్తుగా ఓడించాలి

విలేకరుల సమావేశంలో మండిపడ్డ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో ప్రజలు రెండుసార్లు గెలిపించిన ఏనాడు ప్రజల బాగోగులు పట్టించుకోని పార్టీ మూడోసారి పార్టీ మార్చి మరో నాటకం ఆడుతున్నారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పిలుపునిచ్చారు.బీబీ పాటిల్ ఎందుకోసం ఎంపీ గా పోటీ చేస్తున్నాడు. పది సంవత్సరాలనుండి ఏం చేసాడు నియోజకవర్గానికి, ఏ ఒక్క గ్రామంలోనైనా తిరిగి ఒక్క కుటుంబాన్ని అయినా ఆదుకున్నాడా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.2021 లో పాత్రికేయ మిత్రులపైన బీబీ పాటిల్ పరువు నష్టం కేసు వేస్తానని బెదిరించాడు. అప్పుడు నేను పాత్రికేయ మిత్రులకు అండగా ఉన్నాను. మాస్టర్ ప్లాన్ లో రైతులను మోసం చేసాడు. వ్యాపారంలో కాంట్రాక్టు అయిపోయినట్టు బి ఆర్ ఎస్ పార్టీ తో కాంట్రాక్టు అయిపోగానే బీజేపీ తో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. నియోజకవర్గ యువకులకు ఒక్క ఉద్యోగం ఇప్పించకుండా క్యాబ్ డ్రైవర్లుగా, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ గా చేసాడు. ఒక్క ఉద్యోగం ఇవ్వలే, ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక్క రోడ్డు వెయ్యలేదు చివరికి వచ్చిన నిధులను కూడా వాపస్ పంపిన ఘనత మన ఎంపీ ది. దయచేసి రైతులు, యువకులు అందరూ ఆలోచించండి.బీజేపీ కి ఓటు వేస్తె మూలకున్న కొయ్యను తీస్కొని మన మెడకు ఉరి వేసుకున్నట్టే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించండి. అద్భుతమైన అభివృద్ధిని చేసుకుందాం. ఎల్లారెడ్డి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని రాబోయే రోజుల్లో అభివృద్ధిలో ఎల్లారెడ్డిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దానన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular