నిజామాబాద్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి నామినేషన్ వేసిన అనంతరం నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలుగా నేను రూరల్ ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు నిర్వహించాను. ఒక్కసారి నన్ను గెలిపించి చూడండి జిల్లాలో అభివృద్ధి చూపిస్తాను.

మాజీ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల లో రైతులకు ప్రజలకు ఎంతో అభివృద్ధి పనులు చేపట్టిందని దీనిని దృష్టిలో పెట్టుకొని మన బి ఆర్ ఎస్ తరఫున బాజిరెడ్డికి ఓట్లు వేసి బారి మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ అలీ, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ సంజయ్, రాజ్యసభ ఎంపీ కేసీఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్, బీగాల గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, ఎల్ రమణ, జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, మరియు జడ్పిటిసిలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు టిఆర్ఎస్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
