వర్థన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం రోజురోజుకు పుంచుకుంటుందినాయకుడే ఒక సేవకుడి లాగా పని చేస్తున్న తరుణంలో ప్రజలందరూ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను షీభరాణి -అనిల్ కుమార్ మరియు వరంగల్ మండల పార్టీ అధ్యక్షుడు జన్ను సుధాకర్ ఆధ్వర్యంలో మరియు మడికొండ 64వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్ల మోహన్ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ కోఆర్డినేటర్ పోలేపాక అశోక్ ఆధ్వర్యంలో 65వ డివిజన్లకు చెందిన బిఆర్ఎస్ నాయకులు సుమారు 100 మందిని హనుమకొండ లోని సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని,రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాత కొత్త అనే విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని *వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్వ ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 3వ, 64వ, 65వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
