నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ అర్బన్ వినాయక నగర్ లోని నల్ల హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు.ఆలయంలో జీవన్ రెడ్డి ఆంజనేయస్వామికి, లక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కి ఆలయ నిర్వాహకులు,అర్చకులు ఘన స్వాగతం పలికారు.ఆలయ ప్రాంగణం లో నిర్వహించిన యజ్ఞం లో భక్తులతో కలిసి పాల్గొన్నారు.అనంతరం అర్చకులు జీవన్ రెడ్డి నీ శాలువాతో సన్మానించి, ఆశీర్వచనాలు అందజేశారు.
వినాయక నగర్ హనుమాన్ ఆలయంలో జీవన్ రెడ్డి పూజలు
RELATED ARTICLES
