Thursday, February 12, 2026

పోచారం శకం ముగిసింది

తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాటం చేసాం శెట్కార్

బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శకం ఇక ముగిసిందని, ఓటమి పాలైన ఏనుగు రవీందర్ రెడ్డి నిరుత్సాహ పడకుండా బాన్సువాడ నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటూ నియోజకవర్గం నడిపించే ప్రయత్నం చేస్తున్నారని, ఆనాడు తాను ఎంపీగా ఉన్న సందర్భంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తాము పార్లమెంట్లో పోరాటం చేశామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అంగీకారం మేరకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ స్పష్టం చేశారు. వర్ని మండల కేంద్రంలోని సిసిడిలో వర్ని రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, హాజరయ్యారు.తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో రెండు పర్యాయాలు కేసిఆర్ కు పట్టం కట్టారని కెసిఆర్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేశారని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్యారెంటీ పథకాలను ఇప్పటికే పలు అమలు చేశారని, రాబోయే రోజుల్లో ఒక్కో రైతుకి రెండు లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తారని, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎంపీ అభ్యర్థి పేర్కొన్నారు. గతంలో తాను ఎంపీగా ఉన్న సందర్భంలో రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని నిజాంసాగర్ కాలువల ఆధునికరణకు 500 కోట్ల నిధుల మంజూరు కి తనవంతు కృషి కూడా చేశానని గుర్తు చేశారు. కాల్వల ఆధునికరణతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు కూడా అందించామని అన్నారు. 30 కోట్లతో బీర్కూర్ మంజీరా నదిపై బ్రిడ్జి నిర్మించామని ఆ బ్రిడ్జి నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేకూరిందని అన్నారు. బిబి పాటిల్ బిజినెస్ పటేల్ జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో రెండు దఫాలు, బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా బీబీ పాటిల్ ను పార్లమెంటు సభ్యులుగా ఈ ప్రాంత ప్రజలు గెలిపించారన్నారు. ఆయన ఏనాడు ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత ప్రజల సమస్యల కోసం పోరాటాలు చేయలేదని, ఆయన బిజినెస్ పటేల్ గా చలామణి అయ్యారని ఆరోపించారు. పదేళ్లపాటు ఎంపీగా ఉండి ఏనాడూ గ్రామాల్లో పర్యటించకపోవడం పట్ల ప్రజలు ఆయనను ప్రజా క్షేత్రంలో ఓడించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు. తాను ఐదేళ్లపాటు ఎంపీగా పని చేశానని ఆనాడు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేశానని అన్నారు. పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ పార్టీలో పోటీ చేసి నేడు ఓటమి పాలవడం ఖాయం అన్న విషయాన్ని తెలుసుకొని దేవుడి పేరుతో జపం చేసి గెలుపొందాల అన్న ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీని వీడి నేడు బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఈ ప్రాంత ప్రజలకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలందరూ విషయాన్ని అర్థం చేసుకొని తనను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంత వాణిని పార్లమెంట్లో వినిపించి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు. తాను ఆనాడు బోధన్ బీదర్ రైల్వే లైన్ కోసం సర్వేలు కూడా చేయించానని, ఆనాటి తెలంగాణ ప్రజలు తెలంగాణ నినాదాలు ఓరెత్తించి, బీబీ పాటిల్ ను గెలిపించడంతో బోధన్ బీదర్ లైన్ ఏర్పాటు పనులు కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని శేట్కార్ ధీమా వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే బోధన్ బీదర్ రైల్వేల పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, దేశంలోని రైతాంగం ఎన్నో ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతుందని రైతుల సమస్యలను దూరం చేసేందుకు రాహుల్ గాంధీ ఎప్పటికీ స్పష్టమైన హామీ ఇచ్చారని అన్నారు. బోధన్ లో లాంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీల పున ప్రారంభం పై స్పష్టమైన హామీ ఇచ్చారని, ఫ్యాక్టరీలు తెరిపించడంలో తన వంతు కృషి కూడా చేస్తానని అన్నారు. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా వరి పంటను సాగు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఫ్యాక్టరీలను తెరిపించి చెరుకు సాగుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరిస్తుందన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు పంట సాగు చేస్తున్నారని ఎకరాకు 75 నుండి 100 టన్నుల దిగుబడి వస్తుందని చెరుకు పంట లాభదాయకంగా ఉందని భవిష్యత్తులో ఈ ప్రాంత రైతులు చెరుకు పంట సాగు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉపాధి హామీ కూలీలను ఆదరిస్తాం ఉపాధి హామీ కూలీలకు కూలిరేట్లను పెంచి వారి కుటుంబాల పోషణను ఆదరిస్తామన్నారు. ఉపాధి హామీ కూలీలకు ప్రతిరోజు 400 రూపాయలు పడేవిధంగా చూస్తామన్నారు. ఆశ వర్కర్లకు జీతాలు రెట్టింపు చేస్తామని, అంగన్వాడీలను ఆదరించి వారి జీతభత్యాలను పెంచడంలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. రైతుబంధు 15000 చేస్తాం పంటల సాగు చేసే రైతాంగానికి రాబోయే పంట కాలము నుండి ముందస్తుగానే ఎకరాకు ఏడాదికి 15 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తుందని శేట్ కార్ స్పష్టం చేశారు. పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి లక్ష రూపాయలు అందిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఐదు పథకాలను అమలు చేసిందని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలను ఈ ప్రాంత ప్రజలకు అందించే ప్రయత్నాలు చేస్తానన్నారు. బీబీ పాటిల్ కనీసం తెలుగులో మాట్లాడే వీలు కూడా లేదని, ఏనాడూ పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పలేదని, మరోసారి గెలిపిస్తే ప్రజలకు ఏమి వరగబెడతారని ఆయన ప్రశ్నించారు. కనీసం పార్లమెంట్ సభ్యులకు ఉండే నిధులు ఖర్చు కూడా చేయలేక మురగకొట్టారని అటువంటి నాయకుడు ఏరకంగా ఉపయోగపడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు రెండు పర్యాయాలు ఎంపీగా గెలిపించిన పోచారం బీబీ పాటిల్ అసమర్ధుడని ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన అడ్డంకిగా మారారని మాట్లాడటంపై పాటీల్ కు ఏమాత్రం విలువ ఉందో ప్రజలు అర్థం చేసుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందులు ఉండేవని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్న అనుభవం ఉన్న ప్రజాప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించడం ఈ ప్రాంత అభివృద్ధికి నిధులను కూడా ప్రభుత్వం నుండి సమకూర్చుతున్నారని, రాబోయే రోజుల్లో బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు తాను చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర స్పోక్స్ మాన్ గిరియాషేట్ కార్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, రుద్రూర్ మాజీ సర్పంచ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీల రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు, కొత్తపల్లి విండో అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, మేక వీర్రాజు, బుజ్జి, సురేష్ బాబా, అరుణ్, రమేష్, శ్రీనివాస్, బాలకృష్ణ, నరేష్, కొత్తకొండ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular