Thursday, February 12, 2026

పార్లమెంట్ ఎన్నికల్లో బాన్సువాడ దమ్ము ధైర్యం చూపిస్తాం

కార్యకర్తలను ఉత్తేజపరిచిన ఏనుగు

బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ ఎన్నికల్లో 40 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాటం చేస్తూనే ఉన్నారని 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాన్సువాడలో గెలుపొందారని అయినప్పటికీ నియోజకవర్గ కార్యకర్తలు ఏనాడు నిరుత్సాహం పడకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును పదులపరుస్తూ వచ్చారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కార్యకర్తలను అభినందించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్, మోస్రా, రుద్రూర్, వర్ని, కోటగిరి, పోతంగల్ మండల పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహాక సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎంపీ సురేష్ శెట్ కార్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్లుగా బాన్సువాడ నియోజకవర్గం లో పెత్తనం చెలాయిస్తున్న బడా బాబులకు రోజులు చెల్లాయాన్ని రాబోయే రోజుల్లో బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. తాను బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ, ఈ ప్రాంత ప్రజల మంచితనం తనకు సంతోషంగా ఉందన్నారు. గతంలో పాలకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసుల పేరిట బెదిరించారని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని తాను అండగా నిలబడతానని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, బాన్సువాడ నుండి పోటీ చేసి గెలుపొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సైన్యం బలం పెరగడంతో చెమటలు పడుతున్నాయని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలుపొంది అధికార దాహంతో ఉన్న పోచారం టిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. గెలుపొంది కనీసం నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం లేదని అన్నారు. పోచారం శకం ఇక ముగిసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని వారితో ప్రజలకు ఒరిగేదేమీ లేదని, సంక్షేమ పథకాలైన ఈ ప్రాంత అభివృద్ధి అయినా తమతోనే సాధ్యమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలుపొందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోచారం బెదిరింపు దూరంలో ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన బెదిరింపులకు కాంగ్రెస్ సైన్యం తలవంచే అవసరం లేదని బెదిరింపు దూరంలకు పాల్పడే వారికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బాన్సువాడ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి లభించే విధంగా కార్యకర్తలు గ్రామాల్లో కృషి చేయాలని అన్నారు. ఎంపీ అభ్యర్థి గెలిస్తే తాను బాన్సువాడలో గెలుస్తానని, కార్యకర్తలు గెలుపొందిన వారవుతారని అన్నారు. కార్యకర్తలు గ్రామాల్లో బూతుల వారీగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు సాధించేందుకు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసే దిశలో ముఖ్యమంత్రు రేవంత్ రెడ్డి తీవ్ర కృషి చేస్తున్నారని ప్రజలు ఓపికతో ఫలాలు పొందాలని ఏనుగు రవీందర్ రెడ్డి సూచించారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీల తీర్మానం మేరకే పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. ఈ ప్రాంత రైతాంగం పంటల సాగులో ఆదర్శప్రాయలని, గత ప్రభుత్వం 500 కోట్లతో నిజాంసాగర్ కాలువల ఆధునీకరణ పనులు చేపట్టారని ఆనాటి నుండి నేటి వరకు పదేళ్లపాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. తాను ఓటమి పాలు అయినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని రాబోయే రోజుల్లో మరింత అండగా నిలబడతానని ఏనుగు భరోసా ఇచ్చారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా తనను సంప్రదించాలని కోరారు. పంట రుణాలను మాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ పై స్పష్టమైన హామీ ఇచ్చారని రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకర్లతో ఇప్పటికే ప్రభుత్వం సంప్రదింపులు చేస్తుందని ప్రభుత్వ హామీ మేరకు రుణమాఫీ చేసి తీరుతుందని రైతులు ఆనందంగా ఉండటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలను, ఉద్యోగాలను కల్పించే దిశలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి బై బై చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బాన్సువాడ నియోజకవర్గం లో 30 వేల ఓట్ల మెజార్టీని సాధించి తీరుతామని ఏనుగు రవీందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లపాటు ఎంపీగా ఉన్న పాటిల్ అభివృద్ధి సంక్షేమాలను మరచి వ్యాపారాలు చేసుకున్నారని అటువంటి వ్యక్తులకు రాబోయే రోజుల్లో జహీరాబాద్ పార్లమెంట్ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. ఐదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తే ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి ఒప్పించి, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, షాహిద్ హుస్సేన్, పుప్పాల శంకర్, నాయకులు రాంపూర్ శ్రీనివాస్, ఎంపీటీసీ మనోహర్, సలీం, నజీర్, మిస్స నాగనాథ్ పటేల్, అనంత విట్టల్, బాబీ, రాజు, దత్తు, కొత్తపల్లి కృష్ణారెడ్డి, కొత్తపల్లి విండో అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, మాజీ జెడ్పిటిసి శివరాజ్ దేశాయ్, దే గల్ వాడే శంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular