Thursday, February 12, 2026

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా మండవ వెంకటేశ్వరరావు

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మండవ వెంకటేశ్వరరావు బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండడం, వివాదారహితుడుగా పేరు సంపాదించుకున్న మండవ ను ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపితే విజయం పొందవచ్చు అని సమాలోచనలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేస్తున్నారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న మాజీ మంత్రి, తెలుగుదేశం ఆవిర్భావం నాటి నుండి ఆ పార్టీలో ఎదురులేని నాయకుడిగా నిజాంబాద్ జిల్లాలో చలామణి అయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం ప్రజల్లో ఆదరణ తగ్గడంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాట్లు నాటి నుండి ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాల్లోనూ అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని నోరు విప్పలేదు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చలామణి అయిన సందర్భంలో ముఖ్యమంత్రి నేరుగా మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి తన ఇంటికి రావడంతో మర్యాద కోసం గులాబీ దళంలో చేరారు. గులాబీ దళపతి ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇస్తానని హామీ ఇచ్చి ఐదేళ్లపాటు కాలయాపన చేశారు. అయినప్పటికీ ఏనాడు మండవ రాజకీయ విమర్శలకు తావివ్వలేదు. పదేళ్లపాటు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు కొంత మార్పులు వచ్చాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగుదేశం పార్టీలో ఆనాటి నుండి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని తెలంగాణ పిసిసి అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తికి మన్నించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ రూరల్ స్థానము నుండి పోటీ చేసేందుకు భూపతిరెడ్డి ఐదేళ్లపాటు నియోజకవర్గంలో ప్రజల తరఫున పోరాటాలు చేశారు. పోరాటాలు చేసిన త్యాగశీలిని కాదని తాను పోటీ చేయలేనని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వివరించారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ఆయన ఎంతగానో కృషి చేశారని చెప్పుకోవచ్చు.

ఖమ్మం బరిలో కాంగ్రెస్ పార్టీ తేల్చుకోలేని పరిస్థితి

ఖమ్మం పార్లమెంట్ బరిలో పోటీ చేసేందుకు రాజకీయ ఉద్దండుల కుటుంబ సభ్యులు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల గడువు సమీపిస్తున్నప్పటికీ నేటి వరకు ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పార్టీ ప్రకటించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణికి అవకాశం ఇవ్వాలని భట్టివర్గం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన తనయుడు ప్రసాద్ రెడ్డి ని రంగంలో దింపాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోపక్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు అవకాశం ఇస్తే పోటీలో నిలబడి సునాయాసంగా ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలుపొందుతామని వారి వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాడడంలో ముగ్గురు నాయకుల కృషి ఎంతగానో ఉంది. తెలంగాణ ప్రభుత్వం పదిమంది మంత్రులతో సరిపెట్టుకుంది. పదిమందిలో ముగ్గురు మంత్రులను ఖమ్మం పెద్దలకే కేటాయించారు. ఆ ముగ్గురి కుటుంబ సభ్యులే ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుచునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఖమ్మం పెద్దలు ముగ్గురు కుటుంబ సభ్యులను కాకుండా ఇతరులకు పార్లమెంట్ స్థానాన్ని కేటాయిస్తే గ్రూపు తగాదాలకు స్వస్తి చెప్పవచ్చని ఆలోచనలు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఖమ్మం పార్లమెంట్ స్థానం అభ్యర్థి విషయంలో ఆచి చూచి అడుగులు వేస్తున్నారు. టికెట్ కేటాయింపులో ఎటువంటి ఇబ్బందులు రాకూడదని ఆలోచనలో రేవంత్ లోతుగా పరిశీలన జరుపుతున్నారు. టికెట్ల కేటాయింపు కూడా తనపై వేసుకోకుండా కేంద్ర నాయకత్వంపై భారాన్ని ఉంచారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular