నిజామాబాద్ రైతాంగం పై ప్రకృతి వేసవిలో తాండవం చేస్తుంది. శుక్రవారం జిల్లాలో పలుచోట్ల రాళ్ల వర్షం పెద్ద ఎత్తున కురిసింది. డిచ్ పల్లి శుక్రవారం భారీ ఈదురుగాలులతోపాటు పెద్ద పెద్ద రాళ్లు పడటంతో ప్రాంతాలు నేల రాలాయి. ఆరుగాలం కష్టం చేసి పంటను సాగు చేసి చేతికందేదశలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. మరొక పక్క ఏడాదికి ఒకసారి చేతికిందే మామిడి మరో నెల 15 రోజుల్లో కోతకు వచ్చే సమయంలో భారీ వడగళ్ళు పడడంతో మామిడి కాయ నేలరాలింది. మార్చ్ నెలలో సైతం పలుమార్లు జిల్లాలో వడగళ్ల వర్షం కురిసింది. వడగళ్ల వర్షంతో పంట తీవ్రంగా దెబ్బతింది.

దెబ్బతిన్న పంటలకు సహాయం చేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రితో పాటు పలువురు వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఇప్పటికే నాలుగుసార్లు వడగళ్ల వర్షం పలు ప్రాంతాల్లో పడడంతో రైతన్నలు తీవ్ర నష్టాన్ని గురయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
