Thursday, February 12, 2026

బోధన్ లో అగ్ని ప్రమాదం

బోధన్ మున్సిపాలిటీ పరిధిలో పోలీస్ స్టేషన్ సమీపంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారని ప్రజలు ఎన్నోసార్లు చెప్పినా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నటువంటి షాపులు వాళ్లు ప్రజలు చెబుతున్నారు. అందుకే చెప్తా అక్కడ వేస్తున్నామని అన్నారు. మేము షాపులు తీసేది 10 గంటలకు చెత్త వేసుకొని వెళ్లేవారు వచ్చేదేమో ఎనిమిది గంటలకు వచ్చి వెళ్తారు.

మేము చెత్త ఎక్కడ వేయాలో తెలియక ఖాళీ ప్లేస్ లో వేస్తున్నామని చెబుతున్నారు పోలీస్ స్టేషన్ పక్కా గల్లీలో రోడ్లపైనే చెట్ల కొమ్మలను వేసి నిప్పు వేస్తున్నారు అక్కడే ట్రాన్స్ఫార్మర్ ఉంది. అగ్ని ప్రమాదం జరిగిన దగ్గర బ్యాంకు బ్యాంకు ఉంది. మంటలు ఎగిసిపడే సమయంలో బ్యాంకు మూసి వేయడం జరిగింది. లేకపోతే ఆ మంటలు బ్యాంకులోకి వ్యాప్తి చెంది ఉంటే ఏ స్థాయిలో ప్రమాదం జరిగేదో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది చెత్త సేకరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతిరోజు చెత్తను తొలగించాల్సిన మున్సిపల్ అధికారులు రెండు మూడు రోజులకోసారి చెత్తను తొలగిస్తున్నారు. బోధన్ మున్సిపాలిటీ వారు చెత్త తరలించేందుకు పెద్ద ఎత్తున వాహనాలను ఏర్పాటు చేశారు. చెత్త తొలగింపు కు సిబ్బందిని కూడా సరిపడా నియమించారు. చెత్త తొలగింపు లక్ష రూపాయలు వెచ్చిస్తున్నారు.

బోధన్ పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త బళ్ళు తారస పడుతుంటాయి.ఎవరో ఒక వ్యక్తి రోడ్డుపై చెత్త వేసి నిప్పు పెట్టడం వల్లనే ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. చెత్త సేకరణలో మున్సిపాలిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశాలుంటాయి.

పక్కనే ఉన్న పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసి వాళ్లని రప్పించేంత వరకు అక్కడే ఉండి మంటలను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దీనిపై మున్సిపాలిటీ సిబ్బంది మరియు కమిషనర్, వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular