ప్రైవేటు పాఠశాలలోని బస్సులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. బోధన్ పట్టణంలోని ఆదిత్య హై స్కూల్ కు చెందిన బస్సు బోధన్ లోని రైల్వే ట్రాక్ వద్ద రైలు వెళుతుండగా గేటు వేసి ఉన్న పరిస్థితుల్లో కూడా బస్సు డ్రైవర్ బస్సును ముందుకు కొనసాగించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ట్రైన్ వస్తే అందులో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు, గతంలో కూడా ఈ పాఠశాలకు చెందిన బస్సు ఒక చెట్టుకు ఢీకొడంతో అందులో విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా మారిన పరిస్థితులు నెలకున్నయని తరచూ మాటిమాటికి నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ దీనిపై అధికారులు స్పందించి పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం ఎంతవరకు సమంజసం
RELATED ARTICLES
