కొనుగోలు కేంద్రాలు పరిశీలించడం కిసాన్ మోర్చానెల రోజుల నుండి జిల్లాలో అకాల వర్షం ఈదురు గాలులు పాటు వడగల్లు విపరీతంగా పడ్డాయి. చేతి కందిన వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు రోజులుగా జిల్లాల కురుస్తున్న వర్షాలతో చేతకందిన కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న దాన్యం తడిసి ముద్ద అయ్యాయి. రెండు రోజుల నుంచి అకాల వర్షాలతో తడిసిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని నిజాంబాద్ పార్లమెంట్ కిసాన్ మోర్చా కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. వెల్మల్.కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. వర్షానికి పూర్తిస్థాయిలో వడ్లు తడవడం జరిగింది .తూకాలు వేసినటువంటి బ్యాగులు కూడా తడిసిపోవడం జరిగింది. సీఈఓ ల నిర్లక్ష్యం కారణంగా సరైన సమయానికి తూకాలు వేయనందుకు అకాల వర్షాలతో పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించిందని కిసాన్ మోర్చా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెలుమల్, కుదంపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రాల వద్ద సందర్శించడం జరిగింది. పెద్ద ఎత్తున వడ్ల కుప్పలు తడిసి ముద్దయ్యాయి. వెంటనే జిల్లా జయింట్ కలెక్టర్ తో మరియు డిసిఒ తో మాట్లాడడం జరిగింది .తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి అట్లాగే రంగు మారిన ధాన్యాన్ని వెంటనే తూకాలు వేసి రైస్ మిల్లర్స్ పంపించవలసిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ని కోరడం జరిగింది .కొనుగోలు కేంద్రాల వద్ద తాటిపత్రిలు అదనంగా ఉంచాలని రైతు తూకాలు వేసినటువంటి బస్తాల్ని వెంటనే రైస్ మిల్లర్స్ కి పంపించవలసిందిగా జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగింది. కుదాన్పూర్ గ్రామంలో నిన్నటి పిడుగు పడి మూడు పశువులు చనిపోవడం జరిగింది వెంటనే వెటర్నరీ జెడి తో మాట్లాడడం జరిగింది .నష్టపోయిన పశువుల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు తూకాలు వేయవలసిందిగా. కోరడం జరిగింది. జిల్లాలో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ని కిసాన్ మోర్చా కోరడం జరిగింది .వీరితోపాటు కిసాన్ మోర్చా నాయకులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది.
