Thursday, February 12, 2026

ఎంపీగా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు తనను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. గతంలో ఈ ప్రాంత ప్రజలు తనకు ఎంపీగా 2004లో గెలిపించిన సందర్భంలో ఈ ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి పనులను చేయడంలో కృషి చేశానని మరోసారి అవకాశం వస్తే మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, ఎన్నికల అనంతరం పంట రుణాలను ప్రభుత్వ మాఫీ చేస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు అందజేసి ఆదరిస్తామన్నారు. వ్యవసాయదారులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక ఎంతో ఇబ్బందులకు లోన్ అవుతున్నారని అటువంటి రైతుబంధులను తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు. రైతుల పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగిందన్నారు.కామారెడ్డి నియోజకవర్గం భికనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన పాల కేంద్రం అధ్యక్షులు సర్గు నర్సింలు, మాజీ వార్డు మెంబర్లు బాలరాజు, నర్సింలు, బిల్డర్ చిట్టబోయిన నర్సింలు మరియు 200 మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ , జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , సురేష్ శెట్కార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సురేష్ శెట్కార్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని జంగంపల్లి గ్రామస్థులు శబదం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular