ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఎన్నికల ప్రచారం కామారెడ్డి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తుందని తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నారని షబ్బీర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అత్యధిక స్థానాలు గెలవబోతుందని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం అనేది నాయకులు ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి నియోజకవర్గం బీబీపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ పాల్గొన్నారు. బీబీపేట్ మండలనికి చెందిన సుమారు 600 మంది బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ , సురేష్ శెట్కార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని, బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ లను ప్రజలు ఓటు ద్వారా బొంద పెట్టడం కాయమని, సురేష్ శెట్కార్ ని గెలిపిస్తామని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
