Thursday, February 12, 2026

చక్కెర కర్మాగారాలను పునః ప్రారంభిస్తాం

మాటలు నీటి మూటలే
నిజామాబాద్ ఎంపీ స్థానం కాంగ్రెస్ కు ఖాయం

పసుపు బోర్డు పేరిట రైతులను అరవింద్ మరోసారి మోసం చేసే ప్రయత్నం

ఖజానా ఖాళీ బిఆర్ఎస్ ఖాళీ

oplus_0

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని చక్కెర కర్మాగారాలను పునః ప్రారంభిస్తామని, పసుపు బోర్డు పేరిట మరోసారి అరవింద్ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఖజానా ఖాళీ చేసిన బిఆర్ఎస్ కు రాబోయే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి మండలంలో విఆర్ఎల్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంపీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పది సంవత్సరాల బిఆర్ఎస్, బిజెపి పార్టీలు మన పిల్లల జీవితాలను భవిష్యత్తును నాశనం చేశారు.

తెలంగాణ రాకన్న ముందు మిగులు రాష్ట్రం, దేశం అనేవారు కానీ ఇప్పుడు అప్పుల దేశంగా మారిందని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని హామీ ఇచ్చి, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టి నేటి వరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయలేకపోయారని మరోసారి పసుపు బోర్డు పేరిట రైతులను బిజెపి పార్టీ అభ్యర్థి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.మేము ఇచ్చిన హామీలను నాలుగు పూర్తి చేశామని మిగతావి కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పారు. డేబై సంవత్సరాల పాలనలో తెలంగాణలో నిలబెట్టిన పరిస్థితిని పది సంవత్సరాలలో మొత్తం నాశనం చేశారని దీనివల్ల ప్రజలు ఎంతో నష్టపోయారని అలాంటి దేశద్రోహులు చట్టాలను చేతిలోకి తీసుకొని దుర్మార్గులను బయటపెట్టి వాస్తవాలను వెలుగులోకి లాగుతామని ప్రజలందరికీ తెలియజేసేలా చేస్తామని జీవన్ రెడ్డి అన్నారు. ఈసారి నన్ను భారీ మెజారిటీతో ఎడపల్లి మండలంలోని ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపిస్తే రుణపడి ఉంటానని కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు ప్రజలకు అండగా ఉండే పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు. జీవన్ రెడ్డి గెలిస్తే కేంద్రంలో మంత్రి హోదా లభిస్తుందని తెలంగాణ రాష్ట్రానికి నిధులను సమకూర్చే అవకాశం లభిస్తుందనీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎంపీటీసీలు జడ్పిటిసిలు సర్పంచులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మీయొక్క కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఓటు వేసి నాలుగువేల నుంచి ఐదు వేల మధ్యలో మెజార్టీ అందజేయాలన్నారు. ఎమ్మెల్యేలు గెలవగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు బస్సు ఫ్రీ, గ్యాస్ సిలిండర్ల రేట్లు తగ్గించి ఇస్తున్నారు అదేవిధంగా జీవన్ రెడ్డి ని గెలిపించాల్సిందిగా కోరారు. ఆయన వేసే నామినేషన్ రోజున పెద్ద ఎత్తున ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లాలని టిఆర్ఎస్ కు రెండు పర్యాయాలు ఇచ్చారు. నాకు ఒక్క పర్యాయం ఇచ్చి చూడండి నేను ఏ విధమైన డెవలప్ చేస్తానో చూడండి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని రాబోయే రోజుల్లో అభివృద్ధికి నిధులు సమకూరుస్తానన్నారు

oplus_0

. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు, రైతులు ఉపయోగించే వ్యవసాయ పరికరాలపై పన్నులను ఎత్తివేస్తామన్నారు. మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని రాహుల్ గాంధీ ప్రకటన చేసి ఉన్నారని గుర్తు చేశారు.

oplus_0

ఈ కార్యక్రమంలో ఉర్దూ బోర్డు అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, రామ్మోహన్, జడ్పీ వైస్ చైర్మన్ రజిత ఎల్లయ్య యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగం, ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బెబ్బులి శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్ ,సరిదాస్ ,పరాన్ వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు ఎంపిటిసిలు, జడ్పిటిసి, గ్రామ సర్పంచులు, సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular