కేసీఆర్ స్కీమ్స్ అన్ని స్కామ్స్..
ఉద్యమ కారులను మోసం చేసిన కేసీఆర్..
దేశం కోసం ధర్మం కోసం బిజెపికి ఓటు వేయాలి..
కేసీఆర్ స్కీమ్స్ అన్ని స్కామ్స్ అని
తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్
గోపాల శర్మ అన్నారు. శనివారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ స్టేట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్, నేషనల్ మేనిఫెస్టో కమిటీ మెంబర్,జేఏసీ చైర్మన్ గోపాల శర్మ మాట్లాడుతూ.. నేను 1980 నుంచి బీజేపీ తో అనుభందం ఉందని అన్నారు. దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరు బిజెపికి ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పని చేస్తే నిధులు నియమకాలు కేసీఆర్ కుటుంబానికి దక్కాయని, కేసీఆర్ స్కీమ్స్ అన్ని స్కామ్స్ మాత్రమే నని అన్నారు. కాలేశ్వరం పేరుతో కోట్లాది రూపాయలు నీటిపాలు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు మొండి చేయి చూయించి, ఒక్కరికి కూడా పదవులు ఇవ్వలేదన్నారు. ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకువచ్చి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇస్తున్నారన్నారు.నిజామాబాద్ ఎంపీ టికెట్ కూడా అలాగే ఇచ్చారని అన్నారు. లిక్కర్ స్కామ్ లో కవితకు 5 నుంచి 7 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని వారు చేసిన ఆక్రమాలు, అవినీతి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ భార్యాభర్తల సంభాషణలు వింటూ, సినిమా హీరోయిన్ ల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. నడి ఒడ్డున ఉన్న కలెక్టరెట్ కూలగొట్టి ఊరు చివర కట్టి ప్రజలకు ఇబ్బందులు చేశారని అన్నారు. సిరిసిల్లలో 950 లారీలతో ఇసుక తరలిస్తే అడ్డుకున్న వాళ్ళను ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో ఐ పి ఎస్ నక్కలు కొట్టి పాస్ ఆయ్యవ అంటూ బాధితులకు సపోర్ట్ గా నిలవడంతో నా పై కూడా కేసులు పెట్టీ, నా ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేశారని అన్నారు. అయినా కూడా ఇసుక అక్రమాలపై. ప్రొఫెసర్ కోదండరాం, నేను కొట్లాడమన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సార్లు పాలించిన మార్పు రాదని, అభివృద్ది జరగదని అన్నారు.
బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి వేశారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఆపై మోసం చేస్తున్నారన్నారు. ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బిజెపి మోడీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలన్నారు. బిజెపితోనే దేశం సుభిక్షంగా ఉంటుందని మేధావులు నాయకులు ప్రజలు గమనించాలన్నారు.ఈ మీడియా సమావేశంలో శరత్ అడ్వకేట్ పాల్గొన్నారు.
