Thursday, February 12, 2026

రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేపిస్తాం

ఎన్నికల కోడ్ అనంతరం పంట నష్టపరిహారం చెల్లిస్తాం. తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అకాల వర్షాలకు రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ద్వారా ఏర్పాట్లు చేస్తామని, గత నెల రోజుల నుండి ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారాన్ని ఎన్నికల కోడ్ అనంతరం అందజేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీ ర్యాలీ రైతులకు భరోసా ఇచ్చారు.కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండలం సోమార్ పేట్ గ్రామంలో అకాల వర్షాల వల్ల కళ్ళల్లో ఆరబెట్టిన వరి ధాన్యం కొట్టుకపోవడం మరియు దెబ్బతిన్న పంట పొలాలను ప్రభుత్వ సలహాదారు పరిశీలించారు. మాచారెడ్డి మండలంలోని సోమర్ పేట్ గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు.సోమార్ పేట్ గ్రామంలో గాలికి ఇంటి పై కప్పు ఎగిరి పోవడంతోవారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.గ్రామాల్లో పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.రైతులు, కౌలు రైతులతో మాట్లాడి ధైర్యం నింపారు.రైతులు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు.పంట నష్టపోయిన ప్రతీ రైతును అన్నివిధాలా ఆదుకుంటాం, నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత 15 రోజుల క్రితం రైతు సోదరుల ఆత్మైస్థెర్యం దెబ్బతినొద్దని ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయించి వారి వివరాలు సేకరించి వారికి నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత వారందరికీ నష్టపరిహారం అందిస్తాం.కల్లలో వరి ధాన్యం ఆరబెట్టిన రైతులధాన్యం వర్షానికి కొట్టుకు పోయింది. రైతులకు ఇబ్బందులను ఎదురు కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు.తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని అధికారులతో మాట్లాడారు.వర్షానికి కొట్టుకపోయిన ధాన్యానికి అంచనా వేసి దానికి కూడా ప్రత్యేక నిధుల ద్వారా నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular