Thursday, February 12, 2026

డబుల్ బెడ్ రూమ్ బిల్లులు చెల్లించకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తా

పార్లమెంట్ ఎన్నికల రోడ్ షోలో ప్రసంగించిన పోచారం

బాన్సువాడ నియోజకవర్గం లో 11 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరు చేయించారని, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించుకున్న వారికి నేటికీ బిల్లులు చెల్లించడం లేదని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అనంతరం పేదల నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించకపోతే లబ్ధిదారులతో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తానని మాజీ సభాపతి బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల రోడ్ షో కార్యక్రమం చేపట్టారు. జహీరాబాద్ పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు. తనను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని గాలి అనిల్ కుమార్ కుమార్ అన్నారు. రోడ్ షోలో పోచారం మాట్లాడుతూ తాను సుదీర్ఘ కాలంగా బాన్సువాడ నియోజకవర్గం ప్రాధాన్యం వహిస్తూ ఈ ప్రాంత ప్రజలు అడిగిన ప్రతి పనిని నెరవేర్చాలని ప్రజలు కూడా తన వెంటే ఉండి శాసనసభ ఎన్నికల్లో సైతం తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ అండగా ఉంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని హామీలను గుప్పించి తెలంగాణలో అధికారంలోకి వచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నవంబర్ 9వ తేదీన రైతుల పంట రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి నేటి వరకు కూడా పంట రుణాల మాఫీ చేయలేని అసమర్ధ ప్రభుత్వాన్ని ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. మహిళలకు ప్రతినెల 2500 చెల్లిస్తామని, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని హామీ హామీగానే మిగిలిపోయింది అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో బాన్స్వాడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేపట్టానని, 30 కోట్లతో నిజాంసాగర్ కాలువల ఆధునీకరణ పనులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించామన్నారు. రైతుబంధు 15000 ఎకరాకిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి నేటికీ తమ ప్రభుత్వం ఇచ్చిన 10000ఎకరాకు ఏడాదికి ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తన నియోజకవర్గంలో ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రతి పనిని చేపట్టి తీరానని, పోతంగల్ మండల ఏర్పాటుకు ఏ ఒక్కరూ ఒక్కరోజు కూడా పోరాటం చేయలేదని తాను పోతంగల్ గ్రామానికి న్యాయం చేయాలన్న సదుద్దేశంతో మండలం గా తీర్చిదిద్దానన్నారు. పోతంగంలో తాను ఎప్పుడు సొంతం గ్రామంలో పరిగణిస్తానన్నారు. రాబోయే రోజుల్లో గులాబీ పార్టీకే భవిష్యత్తు ఉంటుందన్నారు. తనకు అండగా ఉన్న ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానని కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను ఇప్పటివరకు మాటిచ్చిన పనులను చేపడితేనే గులాబీ పార్టీకి ఓటేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, జడ్పిటిసి శంకర్ పటేల్, నాయకులు, పోతంగల్ శంకర్, మాధవరావు, పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, శివరాజ్ పటేల్, చాకురే గంగాధర్, నాగరాజుగౌడ్, రామ్ పటేల్, పోతంగల్ విండో అధ్యక్షులు శాంతిశ్వర్ పటేల్, సాయిలు, గంగాధర్ పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular