Thursday, February 12, 2026

పద్మశాలీలందరూ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటాం

పద్మశాలీలతో సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో పద్మశాలి సంఘ సమావేశనికి ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి ని మరియు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ని మరియు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ నిముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి జిల్లా అధ్యక్షులు బిజ్జు దత్తాద్రి , పద్మశాలి నియోజకవర్గ అధ్యక్షులు సునీల్ ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సంజయ్ సింగ్ బబ్లు ,ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు సాయి బాబా గౌడ్ ,పట్టణ పద్మశాలి కౌన్సిలర్ శాల ప్రసాద్ మరియు డిష్ రాము ,మాజీ ఎంపీపీ పోతు నర్సయ్య , ఇతర పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు.ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… పద్మశాలీలు అందరు ఈసారి అనుభవజ్ఞుడైన నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజులలో పద్మశాలి కుల బాంధవులకు నేను మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ పద్మశాలీలంతా కూడా నా పార్లమెంట్ నియోజకవర్గమైనటువంటి నిజామాబాదులో పెద్ద మొత్తంలో పద్మశాలీలు ఉండటం,ప్రతి ఒక్కరు కూడా నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీకి ,చేతు గుర్తుకు ఓటు వేయమని చెబుతూ రానున్న రోజులలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పద్మశాలిల సంఘ భవనానికి స్థలము, భవనానికి కావలసిన నిధులు అలాగే ,ఆర్మూర్ నియోజకవర్గ పట్టణ కేంద్రంలో సంఘ భవనానికి సంబంధించిన నిధులు గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చెప్పి తప్పకుండా నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు.పద్మశాలీలు అందరూ కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతోనే ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular